నల్లపిల్ల నవ్వు / Nalla Pilla Navvu

Vimala

చెన్నయి రైల్వేస్టేషన్‌. ఆ పూట అంత రద్దీగా లేదు. భుజానికి బ్యాగు, బరువైన సూట్‌కేసు లాక్కుంటూ, ఏడవ నెంబరు ఫ్లాట్‌ఫాం పైకెక్కుతుంటే, వినిపించిందా నవ్వు, కన్యాశుల్కం సినిమాలో సావిత్రి నవ్విన మధురవాణి నవ్వులా. ఉంగరాలు తిరిగిన జుట్టును, తలపై అడ్డదిడ్డంగా మడిచి క్లిప్పు పెట్టింది. చుడీదార్‌ వేసుకున్న సన్నటి పొడుగాటి పిల్ల. నల్లటి పెద్ద కళ్లు. కోటేరు ముక్కు, నవ్వితే చొట్టపడే కుడిబుగ్గా, తీర్చి దిద్దిన పలువరస. నేనెక్కాల్సిన కాచీగుడా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఫ్లాట్‌ఫాంపై ఆగివున్నా, ఎక్కకుండా ఒక్కక్షణం అలాగే నిల బడి, ఆ నల్లపిల్లని చూస్తూ వుండిపోయా.

నా బెర్త్‌ వెతుక్కుని, సామాన్లు సర్దుకుని మధురైలో కొన్న విలియం జె. జాక్సన్‌ రాసిన, ‘త్యాగరాజ లైఫ్‌ అండ్‌ లిరిక్స్‌’ పుస్తకం చదువుతూ కూర్చున్నా. సన్నటి అక్షరాలు చికాకు పెడుతున్నా, ఆసక్తిగా చదువుతూ, తలెత్తి చూసేసరికి ఆ పిల్ల, ఇరవై అయిదేళ్లుంటాయేమో. అతని చేయి పట్టుకుని ఏదో మాట్లాడేస్తోంది. ట్రైను కదిలే సమయానికి, సూట్‌కేసు, మరో రెండు బ్యాగులు మోసుకుంటూ వచ్చి, నా ఎదురుగుండా వున్న సీట్లో కూలబడింది. కిటికీ పక్కనే నిలబడ్డ ఆ వ్యక్తితో ఏదో తమిళంలో మాట్లాడుతోంది. ఆ అమ్మాయి మొఖంలో ఆందోళన, భయం. రైలు మెల్లిగా కదిలింది. సామాన్లు సర్దుకుని, సెల్‌ఫోన్‌ హ్యాండ్‌బ్యాగులోంచి తీసి, ఏవో ఎస్‌.ఎం.ఎస్‌.లు ఇచ్చింది. ఎవరికో ఫోన్‌చేసి, తెలుగులోనే గుసగుసగా ఏదో మాట్లాడింది కాస్సేపు. వాలకం చూస్తే, ఏదో సాప్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే అమ్మాయి లాగుంది. నేను నా పుస్తకం చదువు కోవడంలో మునిగిపోయా, ఆ అమ్మాయి మళ్లీ ఎవరికో ఫోన్‌చేసి, వినీ వినపడకుండా, ఎవర్నో దేనికో బతిమిలాడుతోంది. పగలంతా చెన్నయిలో ఊపిరి సలపనంత ఉక్కపోత, ఊరు దాటుతుండగా మొదలైంది వాన. పెద్ద పెద్ద వర్షపు చినుకులు. పుస్తకం మూసి వర్షాన్ని చూస్తున్నా. వర్షపుజల్లు లోనికి వస్తోంది. కిటికీ తలుపులు మూయక తప్పలేదు. అయినా సందుల్లోంచి నీరు కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చేసింది. సీటు క్రింది నుండి సూట్‌కేస్‌ తీసి పైన పెడుతూ అన్నా, ‘‘మీ లగేజ్‌ కూడా తడుస్తుందేమో?’’

‘‘ఇక్కడిదాకా నీళ్లు రావులేండి,’’ అంది. మళ్లీ తనే బ్యాగ్‌లోంచి ఫ్లాస్క్‌ తీస్తూ, ‘‘కాఫీ తాగుతారా?’’ అడిగింది.

వర్షంలో వేడి కాఫీ- చిన్న స్టీలు గ్లాసులో పోసి ఇచ్చిన కాఫీ తాగుతూ అన్నా, ‘‘చాలా బావుంది.’’

‘‘అప్పా బాగా కాస్తాడు. వద్దన్నా, నాకిష్టమని తెచ్చాడు,’’ అంది.

‘‘మీకు రిజర్వేషన్‌ వుందా?’’ చెప్పాను.

‘‘నాకులేదు, తొందరగా, అనుకోకుండా ఈ ప్రయాణం. రిజర్వేషన్‌ దొరకలేదు. జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లో అసలు కూర్చోలేం,’’ అంది.

‘‘టి.సి. నడగండి. బెర్త్‌ దొరుకుతుందేమో!’’ ఉచిత సలహా ఇచ్చాను. టి.సి. రాగానే ఆ అమ్మాయి, మరో నలుగురు ప్రయాణీకులు అతని వెంటపడ్డారు. చివరికి భంగపడి, ఏం చేయాలో తోచక వచ్చి కూచుంది. ‘‘రిజర్వేషన్‌ లేకుండా ఎప్పుడూ రైలెక్కను నేను. చార్మినార్‌ కెడతా జనరల్‌గా. ఇట్లా- ఇదే మొదటిసారి,’’ అంది.

‘‘అయితే, మరేం చేస్తారు?’’ అన్నా.

‘‘ఏం వుంది? ఇక్కడే పడుకుంటా, ఎవరైనా వచ్చి ఈ బెర్త్‌ నాదంటే, అప్పుడు లేచి, క్రింద దుప్పటి పరుచుకుని పడుకుంటా.’’

రిజర్వేషన్‌ లేకుండా, ఎన్నడూ రైలెక్కని అమ్మాయికి ఇలాంటి తెలివైన ఆలోచనలు రావుకదా! అనుకుంటూ, మెల్లిగా కిటికీ తెరిచా. వర్షం పూర్తిగా ఆగిపో యింది. కిటికీ చువ్వల నుండి రాలుతున్న వర్షపు చినుకులు, తడిసిన పచ్చటి మొక్కలు, హాయిగా చల్లటి గాలి, మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఏదో పల్లె- రైలు పట్టాల పక్కనే, వంటిపై సరిగ్గా బట్టలన్నా లేని ఐదారుగురు పిల్లలు నవ్వుతూ చేతులూపుతున్నారు. నేనూ చేయి వూపాను. ఇటు చూద్దును కదా, ఆ అమ్మాయి నాలుగోసారి, కళ్లు మూసుకుని శిలువ గుర్తు వేసుకుంటూ, ఏదో ప్రార్థిస్తోంది. కళ్లు తెరిచి, నన్ను చూసి చిన్నగా నవ్వింది. విచ్చుకుంటున్న పువ్వులా వుందా నవ్వు, ఆ పిల్ల నవ్వులో ఏదో సమ్మోహన శక్తి వుంది. బ్యాగులోంచి రెండు బైండింగ్‌ బుక్స్‌ తీసింది.

కాస్సేపు పేజీలు అటూ, ఇటూ, తిరగేసి, ఓ పుస్తకం లోపల పెట్టి, మరో పుస్తకంలో తదేకంగా ఏదో రాయటం మొదలుపెట్టింది. వంచిన తలెత్తకుండా, చక చకా రాసుకుంటోంది. నేను మళ్లీ నా పుస్తకంలో మునిగిపోయా, ఈలోగా ఏదో ఫోన్‌కాల్‌ మాట్లాడేలోగా సిగ్నల్‌ అందక కట్‌ అయిపోయింది. మళ్లీ కాల్‌ చేసేందుకు ప్రయత్నించి, విఫలమయి, ఫోన్‌ ఛార్జింగ్‌ లేదంటూ, బోగీ చివరకెళ్లింది లగేజ్‌ నాకప్ప గించి. రైలు ఆంధ్రాలోకి ప్రవేశించింది. ఆ అమ్మాయి మళ్లీ పుస్తకం తీసి రాస్తూ వుంది. ఈసారి అంత వేగం లేదు. ఏదో ఆలోచిస్తూ, మధ్య మధ్య కిటికీలోంచి బయటకు చూస్తూ ...

ప్రయాణాల్లో పుస్తకాలు చదివే వాళ్లను తరచూ చూస్తూనే వుంటానుగానీ, ఇలా రాసేవాళ్లని ...

‘‘మీరు పుస్తకాలు బాగా చదువుతారా?’’ అడిగింది. నవ్వి తలూపా. ‘‘మీది మద్రాసా?’’ తల అడ్డంగా ఊపాను.

‘‘మరి?’’

‘‘ఆఫీసు పని మీద మధురై వెళ్లి వస్తున్నా. మాది హైదరాబాద్‌,’’ అన్నా.

‘‘నాకు ఇంగ్లీష్‌ రాదు. ఎక్కువ చదువుకోలేదు. మా ఊర్లో, అదీ, తమిళ మీడియంలో పదో తరగతి వరకూ చదివానంతే,’’ అంది.

‘‘మరి తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. నేను తెలుగువాళ్లే అనుకున్నా,’’ అన్నాను.

‘‘ఊఁ ! చదవలేను. రాయలేను. కానీ మాట్లాడతాను. కష్టపడి నేర్చుకున్నా,’’ అంది.

‘‘మీ తెలుగు బాగా వుంది.’’

‘‘కదా! పదేళ్లుగా హైదరాబాద్‌లోనే వుంటున్నాను మరి,’’ అంది.

‘‘మీరు కథలు, కవిత్వం ఏవన్నా రాస్తారా?’’ అడిగాను.

‘‘లేదు, ఎందుకలా అనుకున్నారు?’’ ఆమె మొఖంలో ఆశ్చర్యం, చిన్న నవ్వు.

‘‘ఇందాకట్నుంచి ఏదో రాసేస్తూ వుంటే ...’’ నేనూ నవ్వాను.

‘‘ఓ అదా! డైరీ, చిన్నప్పటి నుండీ రాయడం అలవాటు. అప్పా వాళ్లింట్లో వున్నాను కదా! నాలుగైదు రోజుల్నించి రాయడానికి కుదర లేదు.’’

రేణిగుంట దాటాక, ఇద్దరు ముగ్గురు మగవాళ్లు ఎక్కారు. ఆ అమ్మాయి చేసేది లేక, లేచి నిలబడింది. నా ప్రక్క కూర్చోమని చోటు చూపాను. కూర్చుంది.

‘‘మీ పేరు?’’ చెప్పాను. నే నడిగితే తన పేరు ‘మధురిమ’ అన్నది. పేరు బాగుందంటే మళ్లీ అందంగా నవ్వింది.

ఈలోగా ఆ అమ్మాయికే ఏదో ఫోన్‌కాల్‌. పది నిమిషాలు.

తమిళంలో ఏదో మాట్లాడుతూనే వుంది. కిటికీలోంచి బయటకు చూస్తే, ఆకాశంలో చందమామ. ఆరోజు పౌర్ణమి అనుకుంటా, మబ్బుల చాటుకెళ్లి దోబూచులాడే చందమామని చూడటం నాకిష్టం. ఏదో మలుపు తిరిగింది రైలు. ఆ దృశ్యం అదృశ్యం కాగానే, నేను మెల్లిగా తల తిప్పాను.

ఆ పిల్ల ఒడిలో ఇంకా తెరిచే వున్న డైరీ. ఏదో దీర్ఘంగా ఆలోచి స్తోంది. బుగ్గపైన జారిన కన్నీటిచుక్క. ఏ తలపులు తలుపు తట్టాయో? డిస్ట్రబ్‌ చేయటం ఇష్టంలేక, తల పక్కకి తిప్పుకున్నాను. ఆ అమ్మాయి ప్రపంచంలో ఆమెని వదిలి. రైల్వే సిబ్బంది నెంబర్లు పిలుస్తూ, ఆర్డర్‌ చేసినవారికి భోజనం ప్లేట్లు అందిస్తూ, హడావిడిగా తిరుగుతున్నారు. ఆ అమ్మాయి అడిగింది. ‘‘మనం కూడా డిన్నర్‌ చేద్దామా!’’ అని.

చదువుతున్న పుస్తకంలో బుక్‌మార్క్‌ పెట్టి, శరవణంలో ప్యాక్‌ చేయించుకు వచ్చిన పొంగల్‌ విప్పాను. ఆ అమ్మాయి అరిటాకులో చుట్టిన ఇడ్లీల పొట్లం విప్పింది. నెయ్యి, జీడిపప్పుతో అలరారుతున్న ఆ పొంగల్‌ ఆరు స్పూన్‌ల కన్నా ఎక్కువ లేదు. అదే ఆ అమ్మాయికి కొంచెం పెట్టాను.

‘‘అప్పా కొబ్బరి చట్నీ, కొబ్బరి చెట్నీనే యేంటి, అన్ని వంటలూ బాగా చేస్తాడు,’’ అంటూ ఇడ్లీలు, చట్నీ వడ్డించింది. నిజంగానే బావు న్నాయి. వంటలొచ్చిన మగవాడికి వంకలెక్కువ అనుకుంటూ అడిగా, ‘‘మీ అమ్మగారు ఏం చేస్తారు?’’ అని.

‘‘అమ్మ నాచిన్నప్పుడే చనిపోయింది. అక్క నాకన్నా పదహారేళ్లు పెద్దది. అక్కే అమ్మలా పెంచింది నన్ను. మా బావగారు విల్లుపురం గవర్నమెంటు కాలేజీలో అటెండరుగా పనిచేస్తాడు. నా చిన్నతనంలో అక్కడే పెరిగా కొన్నాళ్లు,’’ అంది. ‘‘మీరేం చేస్తారు?’’ చెప్పాను. ఆ అమ్మాయిని ఏం చేస్తావని అడిగితే, ‘‘ఏవో చిన్న చిన్న పనులు,’’ అంటూ నవ్వి వూరుకుంది. చెప్పటం ఇష్టం లేదని గ్రహించి, నేనూరుకున్నా.

మళ్లీ ఫోన్‌ మోగింది. ఆ అమ్మాయి ఏదో మాట్లాడబోయేంతలో కట్‌ అయింది. బ్యాటరీ త్వరగా వీక్‌ అయిపోతోందంటూ, లేచి బోగీ చివరకెళ్లి, ఫోన్‌ ఛార్జింగ్‌ చేసేందుకు పెట్టి, అక్కడే నిలబడింది. ఓ గంటయ్యాక చూస్తే, అక్కడే నిలబడి, ఫోన్‌ మాట్లాడుతూవుంది. లోయర్‌ బెర్త్‌. దుప్పటి పరుచుకుని, నా ప్రయాణపు చిన్ని కుషన్‌ తలక్రింద పెట్టుకుని, కళ్లద్దాలు బాక్స్‌లో పెట్టి, కాసిన్ని నీళ్లు తాగి, మరో దుప్పటి కప్పుకుని పడుకున్నా. బాగా అలసిపోయి వున్నానేమో పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది.

అర్ధరాత్రి రెండు గంటలు. ఆ పిల్ల పెద్దగా అరుస్తూ వుంటే మెలుకువ వచ్చేసింది. ఒక్క క్షణం ఏం జరుగుతోందో అర్థంకాలేదు. లైట్‌ వేసేసరికి, రెండు బెర్తుల మధ్యా ఖాళీస్థలంలో దుప్పటి పరుచుకుని పడుకున్నట్లుందా పిల్ల. క్రిందే కూర్చుని, అవతలి బెర్త్‌ పై పడుకున్న, ఓ వయసు మళ్లిన వ్యక్తిని తిడుతూ వుంది. అతనూ, ఆ పిల్లని ఏదో అంటూ వున్నాడు.

‘‘ఏం అయింది?’’

‘‘బెర్త్‌ దొరకలేదు కదా! ఈ రాత్రి జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లోకి ఎట్లా వెళ్లాలని, ఇక్కడే, క్రింద పరుచుకుని పడుకున్నా కదా! ఈ ముసలాడు- నా గుండెల మీద చేయి వేసి తడుముతున్నాడు. ఏదో పొరపాటున, నిద్రలో చేయిజారి, క్రిందికి వాలిందేమోలే అనుకుని, రెండు సార్లు, నేనే చేయి సీటుపైకి ఎత్తిపెట్టా. ముసలాడి బుద్ధి సరిగ్గా లేదండీ, మళ్లీ మళ్లీ అలాగే చేస్తున్నాడు,’’ అంది. ముసలాడివైపు తిరిగి, ‘‘నా వయసున్న మనవరాళ్లున్నా, నీకు బుద్ధిరాలేదా? ఏం అనుకుంటున్నావు. చూడటానికి పెద్దమనిషిలా వున్నావు,’’ అంటూ ఆ పిల్ల తిట్టేస్తోంది.

అతడూ ఊరుకోలేదు. ఆ పిల్లనేదో బూతుమాట అన్నాడు. నాకు వొళ్లు మండిపోయింది. నేను కల్పించుకుని గట్టిగా దులిపేశాను. అప్పుడు, కంపార్ట్‌మెంట్‌లో ఒకరిద్దరు కూడా తిట్టాక, మధ్య బెర్త్‌లో వున్నావిడ, తాను క్రిందికి దిగి, ముసలాయన్ని పైకి పంపింది. తెల్లారేసరికి, ఆ ముసలాయన ఎక్కడో దిగిపోయాడు.

ఉదయం మొఖం కడుక్కుని, టవల్‌తో తుడుచుకుంటూ వుంటే, ఆ అమ్మాయి వేడి వేడి టీ కప్పు అందించింది. రైళ్లలో కాఫీలు, టీలు సాధారణంగా తాగను నేను. రంగూ, రుచీ లేని ఆ వేడినీళ్ల పానీయం- విరక్తి వచ్చేస్తుంది. ఏం అనలేక తీసుకున్నాను.

‘‘థ్యాంక్స్‌ అండీ! మీరు లేకపోతే, ఆ ముసలాయన నన్నింకెన్ని మాట్లనేవాడో. పైకి పెద్దమనుష్యుల్లా కనిపించే వాళ్లని అస్సలు నమ్మకూడ దండి. రౌడీవాడు రౌడీవాడ్లా తెలిసిపోతాడు కాబట్టి, మన జాగ్రత్తలో మనం వుంటాం,’’ అంది. ఈ లోగా ఫోను మోగుతోంది, మళ్లీ కట్‌ అయిపోతోంది. ఆ పిల్ల మొఖంలో ఆందోళన.

‘‘మీ ఫోన్‌ ఒకసారి ఇస్తారా! ఇదేదో నిన్నట్నించీ ఇలానే అవుతోంది. అర్జెంట్‌ కాల్‌ అండీ,’’ అంది. ఇచ్చాను. సిగ్నల్‌ లేక, నా ఫోన్‌తోనూ కాల్‌ చేయలేకపోయింది. మళ్లీ బోగీ చివరకి గబగబా వెళ్లింది. ఛార్జర్‌లో పెట్టి, కాస్సేపయ్యాక అక్కడే నిలబడి, ఏదో గబగబా మాట్లాడుతోంది.

నేను మళ్లీ నా పుస్తకం తెరిచా, సన్నటి అక్షరాల త్యాగరాజును చదవటం ఇబ్బందిగా వుంది. ఫ్రంట్‌ లైన్‌ తీసి, సగం చదివి ఆపిన వ్యాసం మళ్లీ చదవడం మొదలుపెట్టా.

ఆ పిల్ల మళ్లీ వచ్చి నా ప్రక్కనే కూర్చుంది. ట్రైన్‌ ఆలస్యంగా వెడుతోంది. ఆ పిల్ల మొఖంలో ఆందోళన, ఫోన్‌ మళ్లీ మోగింది.

‘‘దార్లో వున్నా. ఇంకో గంట, గంటన్నరకల్లా చేరుకుంటాను. తప్ప కుండా వచ్చేస్తాను. నాకోసం చూడండి ప్లీజ్‌,’’ ఎవర్నో బ్రతిమిలాడుతోంది.

రైలు నింపాదిగా ఆగి ఆగి, సాగి, చివరికి హైదరాబాద్‌కి ముప్పయి కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. టి.సి.ని అడిగితే, ఏదో ప్రమాదం లైన్స్‌ సరి చేస్తున్నారన్నాడు.

‘‘ఏంటి తొందరగా వెళ్లాలా?’’ అన్నా నా పిల్ల ఆతృత చూసి.

‘‘అవునండీ. ఆరునెలల తరువాత దొరికిన అవకాశం. ఇదిపోతే, మళ్లీ కష్టం. ఈ ఆర్నెల్లూ ఎంత అవస్థపడ్డానో నాకు తెలుసు,’’ అంది. నేను మాట్లాడలేదు. మళ్లీ తనే, ‘‘ఎనిమిది గంటలకల్లా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లాలి. కృష్ణానగర్‌లో నా గదికెళ్లి, ఫ్రష్‌ అయి పరిగెత్తాలి. ఇప్పుడు ఆరున్నర. ఆటోలో వెళ్లినా పోగల్నోలేదో.’’

అప్పుడడిగా, ‘‘ఏం చేస్తారు?’’ అని.

ఆ పిల్ల మొఖంలో ఏదో వెలుగు.

‘‘డ్యాన్స్‌. డ్యాన్స్‌ చేస్తాను. సినిమాల్లో గ్రూప్‌ డ్యాన్స్‌లు, టీవీలో సీరియల్స్‌ సాంగ్స్‌కీ, డ్యాన్స్‌ ప్రోగ్రావ్స్‌ుకీ చేస్తాను.’’ ఫలానా సీరియల్‌ మీరు చూశారా అడిగింది. సీరియల్స్‌ చూడను. మా ఇంట్లో టీవీ లేదన్నా. ఆశ్చర్యపోయింది. పాతికేళ్లయినా లేని ఈ పిల్ల, ఎన్ని ఆశలతో మద్రాసు నుండి ఇక్కడికొచ్చిందో కదా అనిపించింది.

‘‘హీరోయిన్‌ అవ్వాలనుకున్నారా?’’ అడిగాను.

ఆ పిల్ల గట్టిగా నవ్వింది. ఆ నవ్వుకి, చొట్టపడ్డ బుగ్గా, చికిలించిన కళ్లూ, ముక్కున తళుక్కున మెరిసిన చిన్న తెల్లరాయి ముక్కుపుల్లా - నిజంగా అందమైన నల్లపిల్ల. నాతో కొంచెం స్నేహం కుదిరినట్లుంది.

‘‘నేనా హీరోయినా! నాకెవరిస్తారు. ఇద్దరు పిల్లల తల్లిని, ఎంతను కుంటున్నారు నా వయసు? ముప్పÛయి ఒకటి మొన్ననే వచ్చాయి,’’ అంది.

ఆశ్చర్యపోవడం నా వంతైంది. అట్లా లేదమ్మాయి.

‘‘నేనసలు డ్యాన్సర్‌ అవ్వాలనుకున్నా. నాలుగేళ్లు భరతనాట్యం నేర్చుకున్నాను. ఈ సినిమాలు, పిచ్చిగెంతులు, నాకిష్టంలేదు. కానీ, అదే, ఇంత కూడు పెడుతోంది. మా అప్పా స్టంట్‌ మాస్టార్‌ దగ్గిర అసిస్టెంట్‌గా చేసేవాడు. అమ్మ చనిపోయాక నన్ను అక్క దగ్గిర పెట్టాడు. మళ్లీ పెళ్లి చేసుకోలేదు అప్పా. నేనన్నా, అక్క అన్నా ప్రాణం. షూటింగ్‌లో ఒకసారి పైనించి క్రింద పడితే తుంటి ఎముక విరిగిపోయింది.

‘‘ఇంకో పనిరాదు అప్పాకి. నేను టెన్త్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాస్‌ అయ్యాను. ఏం చేయాలి? అప్పాకి వంట చేసి పెట్టేందుకు, చూసుకునేందుకు మద్రాసు వచ్చేశాను. ఇంట్లో పరిస్థితి ... చదువుకోడానికి లేకపోయింది. ఒక పెద్ద మాల్‌లో సేల్స్‌గార్ల్‌గా చేరిపోయా. అప్పాకి తెలిసిన సినిమా వాళ్లు అడిగారు, నన్ను చేర్పించమని. నాకు ఇష్టం లేదు. అప్పాకీ లేదు.’’

‘‘మరి ఇప్పుడెలా వచ్చారు?’’ అడిగాను.

‘‘ఏం చేస్తాం,’’ నవ్వింది. ‘‘ఏదో రాసిపెట్టి వుందంటారు ముందే. అట్లానే జరిగిందేమో!’’ అన్నది.

రైలు కొద్దిగా కదిలి, మళ్లీ ఆగిపోయింది.

మళ్లీ ఫోన్‌ ఆ పిల్లకి. ‘‘ఆటో దొరకటం లేదు. ఎక్కగానే ఫోన్‌ చేస్తా,’’ అని చెప్పి, నా వైపు తిరిగి.

‘‘ఎదురుచూడనీ వెధవని - రైల్లోనే వున్నానంటే, ఇంకెవరినో తీసుకుంటాడు,’’ అంది.

‘‘సుబ్రహ్మణ్యం కలవకపోతే, ఇంకోలా వుండేదేమో జీవితం,’’ అంది మళ్లీ తనే.

‘‘సుబ్రహ్మణ్యం ఎవరు?’’ అడిగా.

‘‘వాడా? వాడు మా ఆయన.’’

‘‘ఏం అయ్యాడు?’’

‘‘వాడా! ఇద్దరు పిల్లల్ని పుట్టించి (బూతుమాట) పారిపోయాడు. వాడికి వాళ్ల అయ్య, అమ్మా, వాడి కులం గుర్తుకొచ్చాయి. నన్నొదిలేసి, మళ్లీ వాళ్ల కులం పిల్లనే రెండో పెళ్లి చేసుకున్నాడు,’’ ఆ అమ్మాయి మాటల్లో బాధ, కోపం. ‘‘నాకేం తెలుసు చెప్పండి. పదహారు, పదిహేడేళ్ల వయసు. నేనంటే పడి చచ్చేవాడు. ఏదో కంపెనీలో ఎకౌంటెంట్‌గా చేసేవాడు. నాకన్నా ఎనిమిదో, తొమ్మిదేళ్లో పెద్దవాడు. నమ్మాను. అక్కా, అప్పా ఒప్పుకోరనిపించి, తిరుపతికి పారిపోయి పెళ్లి చేసుకున్నాం. వాళ్లింటికెడితే, గడప తొక్కద్దన్నారు. కొన్నాళ్లు స్నేహితుల ఇళ్లల్లోనే వుండి, చివరికి బెంగుళూరులో ఉద్యోగం దొరికితే, మూడేళ్లు అక్కడే వున్నాం. అక్కడే కూతురు పుట్టింది. చూసేవాళ్లవరూ లేరు. ఫోన్‌చేసి పిలిపిస్తే, మావాళ్లొ చ్చారు. తిట్టారు. ఏడ్చారు. నన్ను అక్క వాళ్లింటికి తీసుకొచ్చింది. అక్కడే మూడు నెలలుండి, ఆరోగ్యం బాగయ్యాక, తిరిగొచ్చా. నేను మా పుట్టింటి కెళ్లాక, సుబ్రహ్మణ్యం అన్నా, నాన్న వచ్చి వెళ్లారట. అతను చెప్పలేదు. వేరే ఎవరో చెబితే తెల్సింది. అతని ప్రవర్తనలో మెల్లిగా మార్పు వచ్చింది. నన్ను కోప్పడటం, మా ఇంట్లోవాళ్లని, మా కులాన్ని తక్కువచేసి మాట్లా డటం మొదలుపెట్టాడు. నాతో ఎక్కువ మాట్లాడేవాడే కాదు. ఏం చేయాలో నాకు తోచేదికాదు. ఒకటే ఏడ్చేదాన్ని. అతను ఇంటికి రాగానే, మళ్లీ మామూలుగా నవ్వేదాన్ని, తనకి తెలియకూడదన్నట్లు,’’ నవ్వింది. రైలు ఆగిపోయింది. ఏడున్నర దాటుతోంది.

సమోసాలు గంప నిండా పేర్చుకుని- గరం గరం సమోసాలంటూ అమ్ముతున్నాడో పిల్లాడు. చిన్న చిన్న హైదరాబాదీ సమోసాలు. పది రూపాయలకి ఇరవయి ఇచ్చాడు. నిజంగానే వేడిగా వున్నాయి. ఆ అమ్మాయికీ, నాకూ మధ్య పేపర్‌ పైన పెట్టి, ఆ పిల్లనీ తినమన్నా.

‘‘నేను మళ్లీ గర్భవతిని. పాపకి ఏడాదిన్నరన్నా నిండలేదు. ఆరోగ్యం అసలు బాగుండేది కాదు. మా అక్క వచ్చి, రెండు నెలలుంది. అప్పుడే, హైదరాబాద్‌లో మరేదో మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. ఇల్లు తీసుకున్నాక, వచ్చి తీసుకెడతానని, వెళ్లిపోయాడు. ఫోన్‌చేస్తే తీసేవాడే కాదు. నాకు హైదరాబాద్‌లో ఎక్కడ పనిచేస్తున్నాడో తెలీదు. పాతఆఫీసులో, అతని స్నేహితుల్ని అడగితే, వాళ్లు సరిగ్గా చెప్పలేక పోయారు. ఏం చేయాలో, అతడేమయ్యాడో తెలీక ఏడ్చేదాన్ని. చివరి కొకరోజు ఫోన్‌చేసి, తనకి ఉద్యోగం రాలేదనీ. పిల్లని తీసుకుని, ఇల్లు ఖాళీచేసి, అక్కతో వెళ్లిపొమ్మని, ఉద్యోగం దొరగ్గానే, వచ్చి తీసుకువస్తానని చెప్పాడు. దిక్కు తోచలేదు నాకు. మా బావగారు వచ్చారు. ఇల్లు ఖాళీచేసి, విల్లుపురం, అక్కా వాళ్లింటికి వెళ్లాను. అప్పటికి ఏడోనెల. అప్పా చాలా బాధపడ్డాడు. సుబ్రహ్మణ్యం నుండి మళ్లీ ఫోన్‌లేదు. నాకు మగ పిల్లాడు పుట్టాడు.’’

‘‘ఎలా వుంటారు పిల్లలు? బాగా చదువుకుంటారా?’’ అడిగాను. ఆ అమ్మాయి నవ్వింది.

‘‘ఆఁ! వాళ్ల నాన్నది ‘గొప్పకులం’ కదా! తెల్లగా వుంటారు. నా పోలికలు. వాళ్ల నాన్న రంగు. తెలివితేటలు ఎవరివో? వాళ్ల నాన్నలా మోసకారితనం, జిత్తులు రాకపోతే చాలు,’’ అంది.

‘‘ఇంతకీ సుబ్రహ్మణ్యం మీ అక్కా వాళ్లింటికి వచ్చాడా, రాలేదా?’’ అడిగాను.

‘‘వస్తే, వాడు నాకు మొగుడెట్లా అవుతాడు?

అప్పుడల్లా మాయం అయినవాడు. మళ్లీ నాలుగేళ్లకి నా కళ్ల బడ్డాడు. ఇంకో బిడ్డ నెత్తుకొని, పక్కనింకో ఆడమనిషి. రెండో పెళ్లాం కాబోలు. నన్ను చూడగానే, రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌ఫాం పై నిలబడ్డా కదా. ఆగి వున్న రైల్లోకి ఎక్కి, అవతల ఫ్లాట్‌ఫాం పైకి దిగి పరుగో పరుగు. దొంగనా...’’ గట్టిగా నవ్వింది. రైలు మెల్లగా కదిలింది.

మళ్లీ ఫోన్‌ మోగింది. ‘‘దార్లో ఉన్నానని చెప్పాను కదా వినిపించు కోవేంటి. ఆటో ఎక్కానన్నా కదా... రైలు చప్పుడా! సిగ్నల్‌ పడి ఆగిందన్నా... ఇంకో గంటన్నా పడుతుంది. వస్తానన్నా కదా!

‘‘ఈ ఛాన్స్‌ పోయిందంటే, మళ్లీ కష్టం. అవకాశాలు కూడా, వస్తే, ఒకదాని వెంట మరొకటొస్తాయి.’’

‘‘ఇద్దరు పిల్లల్తో ...’’

‘‘అవును ఇద్దరు చిన్నపిల్లల్తో అప్పటికి నా వయసెంత ఇర వయ్యో, ఇరవయి ఒకటో- సుబ్రహ్మణ్యాన్ని ఎక్కడ వెతకాలి. మద్రాసు. మాంబళం దగ్గర ఎక్కడో వుంది. ఒకే ఒక్కసారి పెళ్లి చేసుకుని ఇంటికెడితే, గడపలోకి కూడా కాలుపెట్టనీకుండా, వెళ్లగొట్టిన ఇల్లు. కష్టం మీద కనుక్కొని, అప్పా, బావ, అక్కా, నేను, నా పిల్లలం వెళ్లాం. వాళ్లు నానా రభసాచేసి, పోలీసుల్ని పిలుస్తాం వెళ్లకపోతే అని బెదిరించి వెళ్లగొట్టారు. బావ భయస్తుడు. అప్పాకి ఏంతెలీదు. చదువు రాదు. మాకు ఎవరూ దిక్కులేరు. ఆడపిల్లని అక్క దగ్గర వదిలి, కొడుకును తీసుకుని, అప్పా దగ్గరికి వచ్చేశా. ఏదో పని చేసుకుని బతకాలి. ఆ సుబ్రహ్మణ్యంగాడి అంతు చూడాలి. తలుచుకుంటేనే, నా కడుపు రగిలిపోయేది. ఏవో చిన్న, చిన్న పనులు. ఇళ్లల్లో గిన్నెలు తోమే పనుల్తో సహా చేశాను. అప్పా, ఇంటి దగ్గరే సిగిరెట్లూ, పిప్పరమెంట్లూ అమ్మే చిన్న బడ్డీ కొట్టు తెరిచి, నా పిల్లాణ్ని చూసుకునేవాడు.

‘‘అప్పుడే, అప్పా, స్నేహితులు సినిమాల్లో చేస్తావా అని మళ్లీ అడిగారు. అప్పటికీ అప్పా వద్దన్నాడు. మద్రాసులో కాకుండా, ఇంకెక్క డన్నా అయితే, నేను చేస్తానన్నా. అట్లా అప్పా స్నేహితుడు రాందాసు మామతో హైదరాబాద్‌ వచ్చాను.

‘‘హీరోయిన్‌ అవుదామనే,’’ అన్నాను.

‘‘లేదు. బతకటం కోసం. ఏం చేసైనా బతకాలి. నా ఇద్దరు పిల్లల్ని, అప్పాని పోషించాలి. ఇంటికి డబ్బులు పంపాలి. ఏవో చిన్న, చిన్న వేషాలు వచ్చేవి. రాందాసు మామ బంధువుల ఇంట్లో, చిన్న గదిలో వుండేదాన్ని. సినిమావాళ్లంటే, ఎవరూ దిక్కులేని వాళ్లంటే, అందరికీ అలుసే కదా!’’

ఆ పిల్ల కళ్లల్లో సన్నటి నీటిపొర. ఏం జరిగి ఉంటుంది?

‘‘కొన్ని తప్పవు మరి,’’ అని నవ్వింది. ఏం జరిగిందో నాకర్థమైంది.

‘‘చాలాసార్లు వెనక్కి మావూరు వెళ్లిపోదాం అనిపించేది. అక్కడ ఈ పని చేయలేను. ఎంత దుఃఖం వస్తుందో. నాకు కష్టం వచ్చినా, సంతోషం అనిపించినా రాసుకుంటాను. అన్నీ రాస్తాను. మా అప్పా, నేను పదోతరగతి పాసయ్యాక, నా పుట్టినరోజునాడు డైరీ కొనిచ్చాడు. ఇదే మీ అమ్మనుకో. అమ్మకైతే, అన్ని చెప్తావు కదా! అట్లా దీంట్లో రాసుకో అన్నాడు,’’ చిన్నగా నవ్వింది.

‘‘మనకి ఒక్కోసారి కుదరదు కదా! మధ్యలో ఖాళీ పేజీలు మిగిలి పోతుండేవి. అందుకే, ఇదిగో, ఇలా బుక్‌ బైండింగ్‌ చేయించుకుని, ఏ తేదీన వీలైతే, ఆ తేదీన రాసుకుంటాను. నాకు తీరిక దొరికినప్పుడు అవి చదువుకుంటాను. కొన్ని పేజీల్లో బాధ, దుఃఖం, కొన్నింటిలో సంతోషం,’’ అంది.

‘‘మరి రాత్రి రాస్తున్నారు కదా! అది ఆనందమేనా,’’ అడిగాను.

‘‘వూఁ ... పిల్లల్ని కలిశాను. అప్పా దగ్గర మూడు, నాలుగు రోజులు న్నాను. సంతోషమే కదా! వర్షం పడింది కదా! తడిసిన పచ్చటి చెట్లూ, కిటికీ అద్దం మీద నించి జారిపడే వర్షపు నీళ్లూ- వర్షం బావుంటుంది కదా!’’ చిన్నపిల్లలా తలూపుతూ నవ్వింది.

‘‘మీ కిష్టమా?’’

‘‘నాక్కూడా!’’అన్నాను.

‘‘అన్నీ రాస్తానన్నావు. నీ డైరీలు ఎవరన్నా చదివితే ఇబ్బంది కదా!’’ అన్నాను.

‘‘ఇప్పటికి నా దగ్గర పద్నాలుగు పుస్తకాలున్నాయి. నాకున్న ఆస్తి అవే! పొడి అక్షరాల్లో, పేర్లు మార్చో రాసుకుంటాను. అదీ తమిళంలోనే కదా! ఇక్కడ తమిళం చదవటం వచ్చిన వాళ్లవరూ లేరు. చివరికి శ్రీను క్కూడా రాదు,’’ అంది.

‘‘శీనూనా?’’ అన్నాను.

‘‘అవును! అతను సినిమాల్లో ఎక్స్‌ట్రా వేషాలు వేస్తుంటాడు. ఒకే ఇంట్లో వుంటాం. ఇప్పటికైతే బాగానే వున్నాడు. కానీ తాగుతాడు. అప్పుడప్పుడు నేను కూడా అనుకోండి,’’ నవ్వింది. నేనూ నవ్వి, ‘‘పని లేకపోతే, కష్టం కదా- ఎట్లా మరి?’’ అన్నాను.

‘‘ఒక్కోసారి ఎక్కువ ఛాన్సులు వస్తాయి. ఈ మధ్య టి.వి. ప్రోగ్రాం లలో ఎక్కువ పాల్గొంటున్నా. విల్లుపురంలో ఈమధ్యే ఇంటి స్థలం కొన్నా. కొంచెం సంపాదించుకుని మా వూరెళ్లి పోవాలనుందండీ. మా వూరు విల్లుపురానికి ముప్పయి కి.మీ. దూరం. కొన్నాళ్లు మా నాన్నమ్మ దగ్గర కూడా వున్నాను. మగపిల్లల్తోనే ఎక్కువ స్నేహం. ఆ పొలాలు, చింతచెట్లు, ఏటిలో స్నానాలు- ఏటి వొడ్డున గడ్డిలో పడుకుని ఎగిరిపోయే కొంగల బారును చూస్తూ. కథలు చెప్పుకునేవాళ్లం.’’ ఆ పిల్ల గతంలోకి జారిపోబోయింది. ఈలోగా మళ్లీ ఫోను. ‘‘ఎక్కడిదాకానా, అఫ్జల్‌గంజ్‌ దగ్గర ట్రాఫిక్‌ జావ్‌ు. ఏదో యాక్సిడెంట్‌ అయిందంట ముందు ... ఆఁ వినపడటం లేదు,’’ అంటూ కట్‌ చేసింది.

‘‘ఇదేం అబద్ధం,’’ అన్నాను నవ్వుతూ.

‘‘ఏంచేయాలి. పన్నెండుగంటలకి షూటింగ్‌. మమ్మల్ని తొమ్మిది గంటల కల్లా స్టూడియోలో వుండమన్నారు. మొన్న పదిరోజుల క్రితం జరగాల్సింది క్యాన్సిల్‌ అయింది. సరే, టైం వుంది కదా అని మద్రాసు వెళ్లానా, ఇప్పుడు రమ్మని పిలుపు.’’

‘‘రైలు దిగి ఇట్నించి, ఇటే వెళ్లొచ్చుగా,’’ అన్నా.

‘‘కాస్ట్యూవ్స్‌ు ఇంటి దగ్గరే వున్నాయి. వెళ్లక తప్పదు. ఇట్లా అబద్దాలు చెప్పకా తప్పదు.’’

మరో రెండు గంటలు ఆ పిల్ల ఇట్లా అబద్ధపు ట్రాఫిక్‌ జాంలోనే చిక్కుకొని వుండాలి స్టూడియోకి వెళ్లాలంటే.

రైలు మరి కాస్సేపటిలో కాచీగూడ చేరుకుంటుందనగా ఆ పిల్ల అడిగింది. ‘‘టి.వి. స్టూడియోల్లో, మీకెవరైనా తెలుసా!’’ అని తెలీదన్నాను.

స్టేషన్‌లోకి ట్రైన్‌ అడుగుపెట్టబోతూ వుండగానే, ఆ అమ్మాయి గబగబా తన సూట్‌కేస్‌ని, బ్యాగుల్ని సీటు క్రింది నుండి లాగి, బాక్‌ప్యాక్‌ భుజాలకి తగిలించుకొని, చున్నీ తీసి, గబగబా తల చుట్టూ రెండు చుట్లు తిప్పి, కళ్లు మాత్రమే కనపడేలా, మొఖాన్ని చున్నీతో కవర్‌ చేసుకుని, రెండు కొసలూ తల వెనుక బిగించి ముడేసింది. హ్యేండ్‌ బాగ్‌లోంచి గాగుల్స్‌ తీసి పెట్టుకుని, బ్యాగులు లాక్కుంటూ, రైలు ఆగగానే దిగిపోతూ వుంది.

నోటు పుస్తకంలోంచి గభాల్న ఓ కాగితం చించి, నా పేరు, ఫోన్‌ నెంబరు రాసి, దిగిపోయిన ఆ పిల్లని, ‘‘మధురిమా,’’ అంటూ గట్టిగా పిలిచాను. వెనక్కి తిరిగి కిటికీ దగ్గరకొచ్చి, ‘‘బాయ్‌ చెప్పలేదు కదా. తొందరగా వెళ్లాలి కదా!’’ అని నవ్వింది.

కాగితం ఆ పిల్ల చేతిలో పెడుతూ, ‘‘ఎప్పుడన్నా చేయాలనిపిస్తే చేయి. నీ ట్రాఫిక్‌జాం మరో గంటన్నరన్నా వుండాలికదా!’’ అంటూ నవ్వా.

ఆ పిల్లా గట్టిగా నవ్వుతూ చేయి ఊపి వెళ్లిపోయింది. మొఖం కనపడని, ఆ నల్ల పిల్ల నవ్వు నాకు వినిపిస్తూనే వుంది. ఆ పిల్ల చేతిలోంచి, నేనిచ్చిన కాగితం నలిగి జారిపోయింది.

మెల్లిగా సామాన్లు సర్దుకుని చూద్దును కదా! ఆ పిల్ల రాత్రి రాస్తున్న డైరీ సీటు మీదే మర్చిపోయి దిగిపోయింది. ఏంచేయాలో తోచలేదు. పుస్తకం తీసుకుని, రైలు దిగి, ఆ పిల్ల కోసం చూశా. నాకు తెలుసు ఆ పిల్ల ఇక కనపడదని, ఆటోలో వస్తూ, తెరిచి చూస్తే, ఆ నాలుగు వందల పేజీల పుస్తకంలో ముత్యాల్లాంటి అక్షరాల్తో, తమిళంలో ఏదో రాసి వుంది. మొదటి పేజీలో మణి, కేరాఫ్‌ రంగరాజన్‌ అంటూ ఇంగ్లీష్‌లో మద్రాసు అడ్రస్‌ వుంది.

ఇంటికొచ్చి, స్నానం చేసి వేడివేడి ఫిల్టర్‌ కాఫీ తాగి, ఉరుకులు, పరుగులతో ఆఫీసుకెళ్లి, మళ్లీ రొటీన్‌ ప్రారంభం. వారం తరువాత, ఆది వారం దొరికిన విశ్రాంతి సమయంలో, మధ్యాహ్నం తీరిగ్గా, టేబుల్‌ పైనున్న పాత పేపర్లు, పత్రికలు సర్దుతూ వుంటే, కనపడిందా డైరీ. ఏం చేయను. ఎక్కడ వెతకను ఆ పిల్లని. నా ఫోన్‌ నెంబర్‌ వున్న కాగితం ఆ పిల్ల చేతుల్లోంచి జారిపోవడం కాదు, ఎందుకో నలిపి పడేసిందని పించిందప్పుడే నాకు. రైలు దిగిన తరువాత, ఆ పరిచయాన్ని కొనసాగించా లని ఆమెకున్నట్లు లేదు. మళ్లీ తారసపడని అపరిచిత వ్యక్తుల ముందు మనం ఏదైనా స్వేచ్చÛగా మాట్లాడేయగలమేమో! అందుకే ఆ పిల్ల మళ్లీ నన్ను కలవదలుచుకోలేదేమో!

లోపలి పేజీల్లో ఫోటో పది, పన్నెండేళ్ల ఇద్దరు పిల్లలు ఒక వృద్ధుడి ప్రక్కన నిలబడి వున్నారు. నిజంగానే పిల్లలు అందంగా, ఆరోగ్యంగా వున్నారు. ఆ ముసలాయన, మద్రాసు స్టేషన్‌లో కనపడిన మధురిమ వాళ్ల అప్పాలానే వున్నాడు. ఒక్కక్షణం ఈ పుస్తకం డస్ట్‌బిన్‌లో పడేద్దామా అనిపించింది. ఆ అమ్మాయికి, ఈ పుస్తకం ఎంత అపురూపమైందో గుర్తు కొచ్చి, ఆ పుస్తకం మొదటి పేజీలో రాసిన అడ్రస్‌కి పోస్ట్‌ చేయాలనుకున్నా. ఈ మణే, ఆ మధురిమ అయితే, ఆ పిల్లకి తప్పక చేరుతుంది. ఎవరన్నా చదివితే? చదివితే ఏం అవుతుంది? ఇంకా పదమూడు పుస్తకాలు వాళ్లకి తెలీవు కదా, చదివేందుకు! అనాసక్తంగా, పేజీలు తిప్పుతూ వుంటే, కొన్ని పేజీల్లో అక్షరాలు చెదిరిపోయి వున్నాయి. బహుశా కన్నీళ్లేమో! కొన్ని పేజీల్లో ఎండిన గులాబీ పువ్వు, మల్లెపూలు, నెమలి పింఛం కనపడ్డాయి.

ఆ నల్లపిల్ల నవ్వు ఎక్కడి నుండో నాకింకా వినపడుతూనే వుంది.

The Dark Girl’s Laughter

translated by Madhu H. Kaza and Sitaramayya Ari

The Chennai train station was not very crowded at that hour. As I pulled my heavy suitcase onto platform number seven, I heard a woman laughing. I was reminded of Madhuravani’s laughter in the movie, Kanyasulkam. Before me was a tall, slim girl in a chudidaar, her wavy hair clipped to her head. She had big black eyes, a straight nose, a dimple on her right cheek and pearl white teeth. For a second I stood there looking at the black-skinned girl although the Kachiguda Express was already in the station.

On the train I found my berth, stowed my luggage and settled into my seat to read William A. Jackson’s Tyagaraja: Life and Lyrics, which I had purchased in Madhurai. Though the book was interesting, I found the small print irritating. I looked up to see the girl on the platform talking to a man about sixty years old and holding his hand in hers. At the last moment, the girl boarded with a suitcase and two bags and landed on the seat opposite mine. She continued talking with the man through the window. They spoke in Tamil. As the train began to move, the girl stowed her luggage, began texting and made some phone calls, whispering in Telugu. She looked like one of those girls who work for a software company. I got involved in my book, and the girl made another phone call speaking as if she were pleading for something.

During the day the humidity had been unbearable in Chennai. By the time our train reached the outskirts of the city it had started raining. I closed my book and watched the huge drops fall. The wind blew the water into the compartment, so we had to close the windows. Some water still leaked through the window frame. I removed my luggage from under my seat, put it on the overhead rack and said to the girl, “Your luggage may get wet, too.”

“The water won’t come this far,” she said. She pulled a thermos out of her bag and asked, “Would you like some coffee?”

Warm coffee in the rain! “It’s very good,” I told her as I sipped from the small steel cup she’d given me.

“Appa makes great coffee. I told him I didn’t need it, but knowing that I like it, he brought some anyway.”

I had noticed that she hadn’t checked her seat number when she boarded, so I asked, “Do you have a reservation?”

“No, this is an unexpected trip. I couldn’t get a reservation. And the general compartment is impossible.”

“Ask the ticket collector. You may still get a berth,” I offered.

As soon as the ticket collector appeared, she and four other passengers swarmed around him asking for berths. They followed him down the compartment. Eventually the girl came back disappointed.

“I never get on a train without a reservation. Usually I take the Charminar Express. This is my first time travelling without a reservation,” she said.

“What will you do now?” I asked.

“Well, I’ll lie down here. If anybody comes and claims the berth, I’ll just get up and spread my blanket on the floor.”

Where would a girl who never travelled without a reservation get such an idea? I wondered.

The rain stopped, and I opened the window. Drops of water continued to drip from the crossbars. I looked out at the wet greenery and felt a pleasant breeze. Daylight was fading into twilight. Our train passed through a village. Five or six children, barely clothed, stood at a distance and waved at the train. I waved back.

The girl’s eyes were closed and she was crossing herself in prayer. When she opened them, she looked at me and unfurled a smile like a blossoming flower. Her face was mesmerizing. She pulled out two hardcover books from her bag. After leafing through the pages she put one of them away and started writing intently in the other. Her phone rang, but the call was dropped before she could answer. She tried calling the number, but apparently her phone was dead. She asked me to keep an eye on her luggage and walked to the other end of the compartment to charge her phone.

The train entered Andhra.

The girl started writing in her book again but not as quickly as before. She appeared contemplative, looking out the window now and again. I had often seen fellow passengers reading books intently but never writing like this.

“Do you like reading?” she asked.

I smiled and nodded, “Yes.”

“Are you from Chennai?”

I shook my head.

“Where are you from then?”

“I am from Hyderabad. I was in Madhurai for work and now I’m going home.”

“I don’t know English. I haven’t studied much, just up to tenth class in my village. And in a Tamil language school.”

“But you speak Telugu so well — I thought you were Telugu,” I said.

“Well, I can’t read or write Telugu, but I worked hard to learn how to speak it,” she said.

“Your Telugu is good.”

“Isn’t it? That’s because I have been living in Hyderabad for ten years!”

“Do you write poetry or stories?”

“Oh no! Why did you ask that?” she asked.

“Well, you have been writing for a while now.” I smiled.

“Oh, that! It’s my diary. It’s a habit from my childhood. I was at Appa’s place the last few days and didn’t have a chance to write.”

At Renigunta a few men entered our section of the compartment. The girl had to give up her seat and stand. I signaled to her to sit next to me and she did.

“What’s your name?” she asked.

I replied and asked for hers.

“Madhurima,” she said.

I said it was a lovely name. She smiled her beautiful smile. Her phone rang again, and she answered, speaking in Tamil for a while.

It was a night of the full moon. I always love watching the moon on those nights when it slips behind clouds and peeks out again. But the view disappeared as the train made a turn along the tracks. The girl still had her diary open in her lap and appeared to be deep in thought. Who knows what she was recollecting that brought a tear down her cheek. I looked away so I wouldn’t disturb her.

The railway staff were filing up and down the compartment calling out numbers and handing out meal packages. It was then that she asked, “Shall we have dinner, too?”

I placed a bookmark in my book and opened the package of pongal I had purchased at Saravanam. The girl opened a packet of idlis wrapped in a banana leaf. The pongal was made with ghee and cashew nuts but there was no more than about six spoonfuls of it. I shared it with the girl.

“Appa makes good coconut chutney. Not just coconut chutney, he makes everything well,” she said, offering me some of her idlis and chutney. She was right; the idlis were very good.

“What about your mother?” I asked.

“My mother passed away when I was little. My sister is sixteen years older than me and raised me like a mother. My brother-in-law works as a clerk at the government college in Villupuram. As a child I lived there for a few years.

When I asked what she did, she laughed. “Oh, odd jobs, nothing much.”

Her phone rang again. Just as she began talking, the call was cut off. Mumbling that the battery was going dead, she got up and went to the end of our compartment and plugged her phone into the charging unit. An hour later she was still standing there talking on the phone. I spread a blanket on my lower berth, arranged my traveler’s cushion as a pillow, put my reading glasses in their case, sipped some water and lay down under another blanket. I must have been tired; I fell asleep right away.

I was awoken at about two in the morning by screams. At first I didn’t understand what was going on. Turning the light on, I realized that the girl had probably slept on the floor between the berths. She was now sitting and screaming at the old man lying on the berth on the other side. He was also saying something to her.

“What’s going on?” I asked.

“You know I didn’t get a berth. It’s tough traveling in the general compartment, particularly at night, so I spread my blanket here on the floor and slept. This old guy, he put his hand on my chest. I thought maybe his hand slipped down by accident, so I pushed it back to the berth. Twice. But he’s a pervert. He did it again and again.” Turning to the old man she said, “You probably have grandchildren my age — you still don’t have any sense? You look like a gentleman on the outside. What the hell do you think you are doing?”

The man didn’t take it quietly. He began to insult her. Infuriated, I got involved and scolded him. A couple of other passengers got involved, too. Then the woman on the middle berth got down and exchanged berths with the old man. By the morning, he was gone.

As I washed my face and dried off with a towel, the girl handed me a cup of a hot brew. I didn’t usually drink tea or coffee on the train because the colorless, tasteless stuff disgusts me. But I accepted her offer.

“Thank you, madam,” the girl said to the woman now seated on the opposite berth. “If you weren’t here last night who knows what else the old guy would have said. We should never trust the ones who look like gentlemen. It’s not that bad with rowdies because they actually look like thugs, and we can be on our guard.”

Her phone rang again, and again the call got cut off.

“Could I please use your phone?,” she asked, “Mine’s been giving me trouble since yesterday, and I have to make an urgent call.” I gave her my phone but it didn’t help. Apparently the signal strength was poor at our location. She sprinted to the end of our compartment to charge her phone, stood there for a while and talked very fast. I opened my book again, but it was difficult to read the small print, so I pulled out Frontline from my bag and started reading an essay from where I had left off.

The girl came back and sat next to me. The train was running late, and she was anxious. Her phone rang again. “I am almost there. It shouldn’t take more than an hour and a half. I will definitely be there. Please look out for me,” she was saying to someone.

The train moved slowly, stopping and starting. It finally came to a halt about thirty kilometers from Hyderabad. When I asked the ticket collector why the train had stopped, he said that there had been an accident and that the track was being repaired.

“Are you going to be late for something?” I asked the girl.

“Yes, madam. I got some work after trying for six months. If I lose this opportunity it’s going to be hard.” She paused and said, “I went through a lot the last six months.” I didn’t say anything. She continued, “I have to be at Ramoji Film City at nine. First I need to get home to Krishnanagar, freshen up and then rush over. It is already six thirty. I don’t know if I can get there even if I hail an auto.”

“What do you do?” I asked.

Her face brightened. “I’m a dancer. I do group dances in movies. Also in programs for television.”

She asked me if I had watched a certain television serial. I said I didn’t watch serials. I didn’t even own a television set. She was surprised.

This young girl, who didn’t look quite twenty-five, must have had a lot of hopes riding on this opportunity, I thought.

“Do you want to become a star?” I asked.

She laughed out loud. Her laughter revealed a dimple in her cheeks and narrowed her eyes. The white stone in her nose stick sparkled. She was truly pretty, that dark girl.

“Me! A star! Who would take me? I am a mother of two. How old do you think I am? I turned thirty-one just recently!”

It was my turn to be surprised.

“In fact I wanted to become a dancer — I learned Bharatanatyam for four years. I don’t like the stuff in movies, all that jumping around that they call dance, but that’s what’s keeping me fed. Appa used to work as an assistant to a stunt master. After my mother passed away he left me with my sister. He didn’t marry again. He loves me and my sister dearly. Unfortunately, he broke his hip bone one day while working on a movie.

“Appa had no other skills. By that time, I had passed tenth grade, with excellent scores, but given the circumstances, I had to move to Chennai to cook and care for Appa. I couldn’t continue with school; instead I worked as a salesgirl in a big mall. Appa’s colleagues asked him to get me into the film industry, but I wasn’t interested. Neither was Appa.”

“But then, how did you get into it?” I asked.

“Well, not everything is in our hands, is it?” she laughed. “Folks say that our fates are scripted well ahead of time. Maybe that is how it happened.”

The train moved a little, then stopped again.

Her phone rang. “I am looking for an auto. I’ll let you know as soon as I find one,” she said to whomever had called. Then she turned to me and said, “Let him wait. If I tell him I am still on the train, he will take somebody else.”

“Maybe life would have been different if I had not met Subrahmanyam,” she said.

“Subrahmanyam?”

“He was my husband.”

“What happened to him?”

“That bastard, he gave me two children and then one day suddenly he remembered his father, his mother and his caste and ran away. He left me and married a girl of his own caste.

“I was naïve in those days, just sixteen, seventeen years old. He was very fond of me. He worked as an accountant in a company. He was eight or nine years older than me. Appa and my sister didn’t approve of our marriage, so we eloped to Tirupathi. Then we went to see his folks but they didn’t want to have anything to do with us. We stayed in the homes of friends for a while, and finally he found a job in Bangalore, where we lived for about three years. It was there that our daughter was born. We didn’t have anybody in Bangalore to help me during that difficult time. My family came after we asked them for help. They yelled at me. They cried. My sister took me to her home in Villupuram. I stayed with her for about three months until my health recovered and then returned to Bangalore.

“What I didn’t know at the time — Subrahmanyam didn’t tell me — but I learned from others later, was that Subrahmanyam’s older brother and father visited him while I was at my sister’s. After that I noticed a gradual change in his behavior. He would get angry with me for no reason and belittle my family and my caste. He wouldn’t talk to me. I didn’t know what to do. I used to cry a lot, but I’d put on a smile for him when he came home from work so he wouldn’t know how I felt. That was at least what I thought.”

It was just past 7:30. A little boy entered the compartment with a basket and called out, “Hot, hot samosa!” They were the really small Hyderabadi samosas. He gave me twenty of them for ten Rupees. I spread them on a paper between the girl and me and offered to share them. She continued talking: “By then I was pregnant again; my daughter wasn’t even a year and a half. My health was pretty bad. My sister came and stayed with me for a couple of months. Subrahmanyam said that he had found a good job in Hyderabad. He would go, find a place and then he would come get me. He left, but he never answered my calls after that. I had no idea where he was working in Hyderabad. His colleagues from his old office had no idea either. Finally one day he called me and said that he, in fact, hadn’t gotten a job at all and that I should vacate the house in Bangalore and take my daughter to my sister’s. He would come get me after he found a job. I didn’t know what to do. My brother-in-law came to help me pack up and we all went to my sister’s place in Villupuram. I was seven months pregnant at the time. Appa was distraught. That was the last phone call from Subrahmanyam. I gave birth to a baby boy.”

“What are your children like?” I asked. “They must be like you.”

“Well, their father is from a higher caste, so they are fair-skinned. My looks and his color. But how will they turn out? Who knows! If they don’t become rascals like their father I will be happy.”

“So, did Subrahmanyam eventually come to get you from your sister’s place?”

“Even if he came, how could he be my husband? The guy who disappeared on me never showed up again. But I saw him again about four years later on a railway platform. He was holding a child in his arms and there was a woman standing next to him, probably his new wife. As soon as he saw me, he jumped onto the train, came out from the other side and ran off. Bastard!” she laughed.

“With two children, it must have been …”

“Yes. With two little kids … by then I was twenty or twenty-one. Where would I search for Subrahmanyam? His family lived in Chennai, somewhere in Mambalam. I had no idea exactly where. I had gone there just once, right after our wedding. But I was turned away back then, wasn’t allowed even to enter the house. Anyway, with great difficulty my brother-in-law found the address and we all went there: me, my sister, my brother-in-law, Appa and my two kids. His folks made a big scene and threatened to call the police on trespassing charges if we didn’t leave immediately. My brother-in-law is a gentle creature. Appa doesn’t know much. He is uneducated. And we didn’t have anybody on our side for support. So that was it. After that I left my daughter with my sister and came with my son to live with Appa. I had to find a way to stand on my own two legs and I was done with Subrahmanyam. That bastard! When I think of those days, my blood boils. I did odd jobs including washing dishes in people’s homes. Appa opened a small stall at home to sell cigarettes and candies and cared for my son.

“It was then that Appa’s friends asked me again if I would be interested in working in the movies. Appa was against it, but I said I would do it if the work was outside Chennai. That was how I came to Hyderabad with Appa’s friend, Uncle Ramdas.”

“To become an actress?”

“No, just to make a living. I didn’t care what type of work I did. I had to feed my kids and support Appa. Those days I found small roles in films. I lived in a small room in Uncle Ramdas’s house. As you know people working in films and destitutes like me, we are prey to everybody.”

Her eyes glistened with tears.

“You can’t escape some things,” she said, smiling with wet eyes. I understood what must have happened.

“There were so many times when I wanted to leave Hyderabad and go back home. But I can’t do this type of work back there. I feel very sad sometimes thinking about my situation. I write when I feel sad or happy. I write everything. Appa bought me a diary for my birthday the year I passed tenth grade. He said, “If your mother were alive you would tell her everything. Think of it like a mother and write everything in it.”

“Some days I didn’t find time to write, so there would be blank pages in the diary. Now I use a bound notebook and write on the days that I can. And I read my stuff whenever I get time — pain and sadness in some pages and happiness in others.”

“You were writing last night. Was it happiness?” I asked.

“Yes. I saw my children in Chennai. I stayed with Appa for a few days. Of course I was happy. And it rained! The wet, green trees; the rain water sliding down glass windows. Don’t you find the rain beautiful!” She laughed like a little girl.

“Yes.” I said. “You said you write everything. You don’t worry about someone reading your journal?”

“Well, I change names. And I write in Tamil. I’ve filled fourteen notebooks so far, all in Tamil. Nobody knows Tamil where I live, not even Sreenu.”

“Sreenu?”

“He works as an extra in movies. We live together now. So far he’s been good. The only problem is he drinks. But then I drink, too, once in a while.” She laughed.

“If you both are playing small roles, isn’t it difficult to manage when you don’t have work?” I asked.

“Well, sometimes there are plenty of opportunities. A while ago I was working a lot for television. In fact I saved a bit and purchased a housing plot in Villupuram. I would love to return to my village someday. My village is about thirty kilometers from Villupuram. I remember living there with my grandma. I have lots of memories: the farmlands, the tamarind trees, the river where we swam. I was friends with a lot of boys. We used to lie down on a bed of thatch on the river bank and tell each other stories as we watched formations of flying cranes.”

Meanwhile her phone rang again. “Well, not much … there’s a huge traffic jam here in Afjalganj … looks like there was an accident ahead somewhere. What? I can’t hear you.” She hung up.

“Why did you lie?” I laughed.

“I don’t know what else to do. The film shoot is at twelve. We’re supposed to be at the studio by nine. This scene was supposed to have been shot about ten days ago. It was postponed. I thought I had some time, so I went home to Tamil Nadu, but they called me up to return immediately. I can’t afford to miss this shoot.”

“Why don’t you get off the train right here and go. Isn’t it closer from here?”

“Yes. But my costumes are in my room. I just can’t show up without them.”

Another two hours passed. She continued telling stories about traffic jams over the phone. Just as the train was nearing the Kachiguda station the girl asked me if I knew anybody who worked in television. I said I didn’t.

She pulled her suitcase and bag from under the seat, threw the backpack on her shoulder and wrapped her chunni around her head a couple of times so that her face was all covered except for her eyes. She tied the ends of the chunni at the back of her head and put on her glasses and started to roll her luggage towards the door of our compartment. As soon as the train stopped, she jumped down to the platform.

I quickly tore out a page from my notebook, wrote down my name and phone number on it and called out, “Madhurima!”

She came back to the window and said, “Sorry I didn’t say goodbye. I’m worried about being late.”

“I imagine your traffic jam should last at least an hour and a half more,” I teased. “If you ever feel like giving me a call, please don’t hesitate.”

She laughed and hurried away. The piece of paper I gave her — I saw it fall out of her hand.

As I was collecting my luggage I found her journal on a nearby seat. I grabbed it and hurried to the platform to look for her. I knew it would be difficult to find her. I didn’t know what to do.

In the auto on my way home I opened the journal. It contained four hundred pages of writing in a steady, beautiful, Tamil hand. There was an inscription on the first page — Mani, Care of Rangarajan — followed by an address in Chennai.

At home I showered and brewed a hot cup of coffee. Then I went to the office and fell back into my work routine. The following Sunday, I found a little time to catch up with the pile of old newspapers and magazines that had collected in my absence. It was then I noticed her journal again. What should I do with it? Where would I find the girl? The paper on which I had given her my name and phone number had fallen out of her hand. It occurred to me then that she might have deliberately discarded it. Maybe we can talk most freely with people we are unlikely to meet again.

Between the pages of the journal there was a photo of two children, ten or twelve years old, standing next to an old man, who looked like the Appa who was with Madhurima in the train station at Chennai.

I thought of throwing the journal away. But remembering how dear it was to the girl I thought of mailing it to the address on the first page. If Mani was Madhurima, the journal would reach her. If not? Well, what would happen? Whoever received it would not be able to read the other thirteen books anyway. As I turned the pages in the journal, I noticed some places where the writing was stained. Tears probably. Between some pages there were dried rose petals, jasmines and a peacock feather.

I could still hear the dark girl’s laughter.

about the author